కరోనాపై సానియా సూచనలు..
close

తాజా వార్తలు

Published : 05/03/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై సానియా సూచనలు..

హైదరాబాద్‌: పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చని ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో దాన్ని దరిచేరనీయకుండా ఉండేందుకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె పలు సూచనలు చేశారు. ‘‘చైనాలో మొదలైన కరోనా విష మహమ్మారి ప్రస్తుతం మనదేశంలోకీ విస్తరించింది. ఈ వైరస్‌ సోకితే జలుబు, తలనొప్పి, జ్వరం తదితర లక్షణాలు ఉంటాయి. ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ ‘104’కు ఫోన్‌ చేసి సలహాలు, వైద్యసాయం పొందవచ్చు. అదేవిధంగా వైరస్‌ను దరిచేరనీయకూడదంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ముఖానికి మాస్కు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలి. జలుబు, జ్వరం, తలనొప్పి లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండండి’’ అని సానియా సూచించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని