‘అహ్మదాబాద్‌ను మినీ పాకిస్థాన్‌ అంటారా?’
close

తాజా వార్తలు

Published : 07/09/2020 18:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అహ్మదాబాద్‌ను మినీ పాకిస్థాన్‌ అంటారా?’

సంజయ్‌ రౌత్‌ క్షమాపణలు చెప్పాలి : భాజపా

అహ్మదాబాద్‌: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ గుజరాత్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్‌ చేసింది. అహ్మదాబాద్‌ను మినీ పాకిస్థాన్‌ అంటూ వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొంది. సంజయ్‌కి కంగనాకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రౌత్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘కంగనా ముంబయిని పీవోకేతో పోల్చింది. అహ్మదాబాద్‌ను కూడా పాకిస్థాన్‌తో పోల్చే ధైర్యం ఆమెకు ఉందా?’’అని రౌత్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలపై భాజపా నేత భరత్ పాండ్యా మండిపడ్డారు. రౌత్ గుజరాత్‌ను ఇక్కడి ప్రజలను అవమానించారని పేర్కొన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈర్ష్యా, ద్వేషాలతో గుజరాత్‌ను, ఇక్కడి నుంచి వచ్చిన నాయకులను విమర్శించడం మానుకోవాలన్నారు.

‘‘ఇది గాంధీజీ, సర్దార్‌ పటేల్‌ల గుజరాత్‌. 562 సంస్థానాలను భారతదేశం అనే గొడుగు కింద ఒక్కటిగా చేసిన ఘనత పటేల్‌దే. జునాగఢ్‌, హైదరాబాద్ వంటి వాటిని  పాకిస్థాన్‌లో కలవకుండా  చేసిన వ్యక్తి. జమ్మూ, కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో భాగం చేయాలని కలలుగన్నారాయన. ఆయన కలలను నరేంద్రమోదీ , అమిత్ షా లు సాకారం చేశారు. భారత దేశాన్ని ఐక్యంగా ఉంచటంలో గుజరాత్‌ ముఖ్యపాత్ర పోషించింది’’ అని పాండ్యా గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని