కంగనా క్షమాపణ కోరితే నేనూ ఆలోచిస్తా: రౌత్
close

తాజా వార్తలు

Updated : 06/09/2020 14:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంగనా క్షమాపణ కోరితే నేనూ ఆలోచిస్తా: రౌత్

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ విషయంలో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ముంబయిపై చేసిన వ్యాఖ్యల మాదిరిగానే అహ్మదాబాద్‌ నగరంపై చేయగలరా.. అని ఆమెను ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ మీడియాతో మాట్లాడారు.‘కంగనా ఒకవేళ తన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రజలను క్షమాపణలు కోరితే.. నేను కూడా తిరిగి ఆమెను క్షమాపణ కోరేందుకు ఆలోచిస్తా. అంతేకాకుండా, ఆమె ముంబయిపై చేసిన వ్యాఖ్యల మాదిరిగానే అహ్మదాబాద్‌పై కూడా చేయగలరా’ అని ప్రశ్నించారు.

కంగనా రనౌత్‌ ఇటీవల సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు గురించి మాట్లాడుతూ.. మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే ఎక్కువ భయం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై మండిపడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ కంగనాను ముంబయికి రావద్దంటూ.. తన స్వస్థలం మనాలీలోనే ఉండిపోవాలంటూ సూచించారు. అనంతరం కంగనా తిరిగి స్పందిస్తూ.. ఇలా చేయడం తనను పరోక్షంగా బెదిరించడమేనని.. ముంబయి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని వ్యాఖ్యలు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని