తమిళనాడు ఎన్నికలకు ముందు...: వర్మ
close

తాజా వార్తలు

Published : 21/11/2020 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళనాడు ఎన్నికలకు ముందు...: వర్మ

‘శశికళ’ బయోపిక్‌ అప్‌డేట్‌

హైదరాబాద్‌: వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ జీవితాల ఆధారంగా సినిమా తీస్తున్నట్లు చాలా రోజుల క్రితం ఆయన ప్రకటించారు. ఇన్నాళ్లకు ఆ చిత్రం అప్‌డేట్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘శశికళ’ సినిమాను రూపొందిస్తున్నాం.. ‘ఎస్‌’ అనే మహిళ, ‘ఇ’ అనే పురుషుడు ఓ నాయకురాలి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించారో ఈ సినిమాలో చూపించబోతున్నాం. తమిళనాడు ఎన్నికలకు ముందు, నాయకురాలి (జయలలిత) బయోపిక్‌ (తలైవి) విడుదల రోజున దీన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను నిర్మించిన రాకేష్‌ రెడ్డి ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు’ అని వర్మ ట్వీట్లు చేశారు.

వర్మ గత కొన్ని రోజులుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వివాదాస్పద చిత్రాలు తీస్తూ.. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా ‘మర్డర్‌’ సినిమా తీశారు. ‘దిశ’ హత్యాచార ఘటన ఆధారంగా తీస్తున్న ‘దిశ: ఎన్‌కౌంటర్‌’ చిత్రం కూడా వివాదాల్లో పడింది. ఇవి కాకుండా వర్మ తన జీవిత కథతో ‘రాము’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో ‘కరోనా వైరస్‌’ అనే సినిమాను కూడా తీశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని