27న శశికళ విడుదల: మళ్లీ AIADMKలో చేరతారా?
close

తాజా వార్తలు

Published : 20/01/2021 01:49 IST

27న శశికళ విడుదల: మళ్లీ AIADMKలో చేరతారా?

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కారాగార వాసం ముగియనుంది! ఈ నెల 27న ఉదయం ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారని శశికళ తరఫు న్యాయవాది రాజా సెతురపాండియన్‌ వెల్లడించారు. 2016లో జయలలిత మరణానంతరం అక్రమాస్తుల కేసులో ఆమె అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10కోట్లు జరిమానా చెల్లించి ఏడాది ముందుగానే విడుదల కాబోతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న వేళ ఆమె జైలునుంచి విడుదల కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

శశికళ అన్నాడీఎంకేలో చేరతారా?

మరోవైపు, శశికళ తిరిగి అన్నాడీఎంకేలో చేరతారా? అని మీడియా అడిగిన ప్రశ్నల్ని తమిళనాడు సీఎం పళణిస్వామి తోసిపుచ్చారు. ఆ అవకాశమే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. శశికళ అన్నాడీఎంకేలో లేరని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె తమ పార్టీలో చేరే ప్రసక్తి లేదన్నారు. దీనిపై పార్టీలో స్పష్టమైన నిర్ణయం తీసుకుని పనిచేస్తున్నామని, మరో ఆలోచనే లేదన్నారు. జయలలిత మరణానంతరం శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

వీరే ‘గబ్బా’ర్‌ సింగ్‌లు..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని