కోలుకున్న శశికళ: ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి
close

తాజా వార్తలు

Updated : 31/01/2021 14:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోలుకున్న శశికళ: ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి

బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఆరోగ్యం కుదుటపడడంతో నేడు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందిన శశికళకు ఈ మధ్యే కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉండడంతో డిశ్ఛార్జి చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో నాలుగేళ్ల శిక్షను అనుభవించారు. ఈ నెల 27వ తేదీన శిక్షా కాలాన్ని పూర్తిచేసుకున్నారు. విడుదల సమయం దగ్గర పడిన సమయంలోనే ఆమెకు అస్వస్థత నెలకొనడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్ఛార్జి చేస్తున్నట్లు ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. డిశ్ఛార్జీ సమయంలో ఆస్పత్రి వద్దకు ఆమె అభిమానులు తరలివచ్చారు. అయితే, ప్రస్తుతం ఆమె మరికొన్ని రోజులు బెంగళూరులోనే ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరో వారం రోజుల తర్వాతే ఆమె చెన్నై వెళ్లే అవకాశాలు ఉన్నట్లు శశికళ సన్నిహితులు వెల్లడించారు. ఇదిలాఉంటే, తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనే శశికళ విడుదల కావడంతో రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి..
తమిళనాడు: విద్యార్థులకు ఉచితంగా రోజుకు 2GB డేటా
అధికారంలోకి వస్తే విద్యా రుణాలు రద్దుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని