వారిపై దాడులను ఖండించిన సత్య నాదెళ్ల

తాజా వార్తలు

Updated : 26/03/2021 19:59 IST

వారిపై దాడులను ఖండించిన సత్య నాదెళ్ల

వాషింగ్టన్‌: ఆసియన్‌ అమెరికన్లపై వరుసగా జరుగుతున్న దాడులు బాధ కలిగిస్తున్నాయంటూ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతోపాటు పలువురు అమెరికా చట్టసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియన్‌ అమెరికన్ల పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష, హింస, అసహనం సరికాదని.. అది ఏ రూపంలో ఉన్నా తీవ్రంగా ఖండించాలని సత్య నాదెళ్ల ట్వీట్లు చేశారు. పలువురు అమెరికా చట్టసభ్యులు కూడా ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ తరహా దాడులు సరికాదన్నారు. ఈ దాడులకు దిగేవారు తక్షణమే ఆ మార్గాన్ని విడనాడాలన్నారు. ఆసియన్‌ అమెరికన్ల పట్ల అమానుషంగా ప్రవర్తించేవారు అమెరికన్లు కాజాలరని పేర్కొన్నారు.

గతేడాది మార్చి నుంచి డిసెంబర్‌ వరకు అమెరికా వ్యాప్తంగా ఆసియన్‌ అమెరికన్లపై 3 వేలకుపైగా దాడులు జరిగాయని ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది. 2019లో ఈ తరహా దాడులు కేవలం 2016 మాత్రమే నమోదవ్వగా, 2020లో దాదాపు 14 రెట్లు పెరిగాయి.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని