close

తాజా వార్తలు

Updated : 09/03/2021 16:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్కడుంటే సింథియా ఎప్పటికీ సీఎం కాలేరు

దిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం కాంగ్రెస్‌ నుంచి కమలం గూటికి చేరి మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి భాజపాను గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింథియాపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. సింథియా కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ఎప్పటికైనాముఖ్యమంత్రి అయ్యేవాడన్నారు. భాజపాలోకి వెళ్లి ఆ పార్టీలో చివరి వ్యక్తి (బ్యాక్‌ బెంచర్‌)గా నిలిచారని ఎద్దేవా చేశారు. దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ యువజన సమావేశంలో రాహుల్‌ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రివి అవుతావని తాను సింథియాకు చెప్పానని, కానీ, అందుకు విరుద్ధంగా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు భాజపాలో చివరి వ్యక్తిగా నిలిచారని అన్నారు. ‘‘కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. సింథియా భాజపాలో ఉంటే ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కావాలనుకుంటే వెనక్కి వచ్చేయాలని సూచించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని