
తాజా వార్తలు
పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఎస్ఈసీ ఆగ్రహం
అమరావతి: ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. రేపు పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిద్దరికీ మెమోలు జారీ చేశారు.
ఈ ఉదయమే సమావేశం నిర్వహించాలని ఎస్ఈసీ భావించినప్పటికీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లు సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు వారితో సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఆ సమయానికి ఇద్దరు అధికారులు హాజరుకాకపోవడంతో ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్లకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మెమోలు జారీ చేశారు.
ఇవీ చదవండి..
నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సమాయత్తం
తారక్ ట్రాఫిక్ జరిమానా చెల్లించిన అభిమాని