అధికార పార్టీ అయినా పాటించాల్సిందే: నిమ్మగడ్డ
close

తాజా వార్తలు

Published : 01/03/2021 21:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అధికార పార్టీ అయినా పాటించాల్సిందే: నిమ్మగడ్డ

విశాఖ: అధికార పార్టీ సైతం ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పుర ఎన్నికలు కూడా శాంతియుతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. విశాఖ పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ మాట్లాడారు. 

సాధారణ ఎన్నికల మాదిరిగా విశాఖలో పోలింగ్‌శాతం నమోదవుతుందని భావిస్తున్నామన్నారు. ఈనెల ఏడో తేదీ నాటికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిబంధనలు ఇచ్చిందో వాటినే అమలు చేస్తున్నామన్నారు. రోడ్డు షోల విషయంలో స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. విశాఖలో బార్‌ యజమానులను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని.. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. కుల సంఘాల సమావేశంలో ఏయూ వీసీ పాల్గొనే అంశంపై జిల్లా కలెక్టర్‌తో విచారణకు ఆదేశించినట్లు నిమ్మగడ్డ వివరించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని