ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులపై నిమ్మగడ్డ స్పందన
close

తాజా వార్తలు

Published : 19/03/2021 18:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులపై నిమ్మగడ్డ స్పందన

శాసనసభ కార్యదర్శికి లేఖ రాసిన ఎస్‌ఈసీ

అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఈమేరకు శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు లేఖ రాశారు. సభా హక్కులకు భంగం కలిగించారంటూ చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నానని ఎస్ఈసీ పేర్కొన్నారు. శాసనసభ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. సభా హక్కులు ఉల్లంఘించారంటూ తనకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత ముందుకు వెళ్లాలని భావిస్తే తగినన్ని ఆధారాలు సమర్పిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో తగినంత సమయం ఇవ్వాలని ఎస్ఈసీ కోరారు. ఇటీవలే కొవిడ్ టీకా తీసుకున్నందున ప్రస్తుతం ప్రయాణాలు చేయలేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖలో వివరించారు.

ఎస్‌ఈసీపై సభా హక్కుల ఉల్లంఘన కింద మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు, మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఒక నోటీసును శాసనసభ సభాపతికి ఇచ్చారు. వాటిని స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు. ఆ ఫిర్యాదులను విచారణకు స్వీకరించిన కమిటీ.. ‘వాటిపై వివరణ ఇవ్వాలి. అవసరమైతే వ్యక్తిగతంగా కూడా హాజరు కావాల్సి ఉంటుంది’ అంటూ ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది.

 

 

 

 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని