
తాజా వార్తలు
బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతాధికారుల బదిలీల ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ ప్రతిపాదనలను ఎస్ఈసీ తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు తగవని స్పష్టం చేసింది. బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని సూచించింది.
‘‘సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం, ఇప్పటికే నోటిఫికేషన్ రీ షెడ్యూల్ చేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరుణంలో ముఖ్యమైన ఇద్దరు అధికారుల బదిలీ సరైన చర్య కాదు. కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది’’ అని పేర్కొంటూ కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన జారీ చేసింది.
‘రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్ ఇప్పటికే బదిలీ అయ్యారు.. ఆయన (రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్) ఇంకా ఎంత మందిని బదిలీ చేసుకున్నా మేం పట్టించుకోం’ అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలసిందే. ఈనేపథ్యంలో ఈరోజు ఉదయం ఎస్ఈసీ .. ఉన్నతాధికారుల బదిలీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ప్రకటన జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి....
ఎన్నికలు, కరోనా టీకాలూ ఒకేసారి సాధ్యం కాదు
ఎస్ఈసీ ఎందరిని బదిలీ చేసినా పట్టించుకోం