1,323 సర్పంచ్‌ నామినేషన్లు తిరస్కరణ
close

తాజా వార్తలు

Published : 02/02/2021 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1,323 సర్పంచ్‌ నామినేషన్లు తిరస్కరణ

అమరావతి: ఏపీ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. జిల్లాల వారీగా అర్హత కలిగిన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ కారణాలతో పలువురు సర్పంచ్‌, వార్డు మెంబర్‌ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపింది. విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3,249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికోసం 19,491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18,168 మాత్రమే అర్హత కలిగినవిగా నిర్ధారించారు. సర్పంచ్‌ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 1,323 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 

సర్పంచ్‌ అభ్యర్థులకు సంబంధించి చిత్తూరు జిల్లాలో 349, విశాఖపట్నం 152, తూర్పుగోదావరి 141, ప్రకాశం 138, అనంతపురం 112, గుంటూరు 84, కృష్ణా 76, శ్రీకాకుళం 62, కర్నూలు 62, కడప 54, పశ్చిమగోదావరి 52, నెల్లూరు 41 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వార్డు సభ్యులకు సంబంధించి మొత్తం 2,245 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 12 జిల్లాల్లో 32,502 వార్డులకు ఎన్నికలు జరగనుండగా  వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 77,554 నామినేషన్లు మాత్రమే అర్హమైనవిగా నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో 336, చిత్తూరు 301, శ్రీకాకుళం 265, కడప 261, తూర్పుగోదావరి 231, కృష్ణా 186, గుంటూరు 147, నెల్లూరు 136, అనంతపురం 117, పశ్చిమగోదావరి 102, విశాఖ 100, కర్నూలు 63 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇవీ చదవండి..

బాధిత కుటుంబానికి ఎస్‌ఈసీ పరామర్శ

సర్పంచి అయితే ఐదేళ్లు.. వైకాపా ఉండేది ఇంకా రెండేళ్లే


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని