కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజు నోటీసు
close

తాజా వార్తలు

Updated : 12/02/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజు నోటీసు

అమరావతి: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఎస్‌ఈసీని కించపరిచేలా కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారని నోటీసులో పేర్కొన్నారు. ‘‘కమిషన్‌ ప్రతిష్ఠను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయి. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలి. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు బహిరంగ ప్రకటన చేయాలి. సాయంత్రం 5గంటల్లోగా మంత్రి కొడాలి నాని స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా సమాధానం ఇవ్వాలి’’ అని ఎస్‌ఈసీ ఆదేశించారు.

తాడేపల్లిలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పినట్టు ఎస్‌ఈసీ నడుచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు తొలుత నిలుపుదల చేయడం, ఆ తర్వాత ప్రభుత్వం వద్దని చెప్పినా నిర్వహించడం వెనుక ఎవరున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్‌ ప్రభంజనాన్ని ఆపలేరన్నారు. నిమ్మగడ్డ, చంద్రబాబు వేర్వేరు అని ప్రజలు అనుకోవట్లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి, ఎలా నిర్వహించాలనేది పార్క్‌ హయత్‌లో సమావేశమై నిర్ణయించారని ఆరోపించారు. వీళ్లంతా ఒక వ్యూహంతోనే నడుస్తున్నారని కొడాలి నాని విమర్శించారు.  కొడాలి నాని మీడియా సమావేశం ఫుటేజ్‌ పరిశీలించాక ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి..
పురపాలక, జడ్పీటీసీ ఎన్నికలకు అంగీకారం

కారుతో ఢీకొట్టి కార్పొరేటర్‌ హత్యTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని