అఖిలప్రియ సోదరుడి పిటిషన్‌ కొట్టివేత
close

తాజా వార్తలు

Published : 30/01/2021 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఖిలప్రియ సోదరుడి పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్: బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ సికింద్రాబాద్‌ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇంకా కొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని, జగత్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అతని ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. మరో వైపు ఇప్పటికే అరెస్టయిన 15 మంది బెయిల్‌ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది.

మియాపూర్‌ సమీపంలోని హఫీజ్‌పేటలో రూ.2 వేల కోట్ల విలువైన 48 ఎకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో అఖిలప్రియ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో బాహ్యవలయ రహదారిపై  విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ కేసులో అఖిల ప్రియను ఏ1, సుబ్బారెడ్డిని ఏ2, అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ను ఏ3 ముద్దాయిలుగా ఉన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని