విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం
close

తాజా వార్తలు

Updated : 03/01/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం ఘటన మరువక ముందే తాజాగా విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ వద్ద ఉన్న సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహం ధ్వంసమైంది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ పనిచేశారా? లేక కిందపడి విగ్రహం పగిలిపోయిదా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి  చేరుకుని పరిశీలించారు.

ఎలుకలు లేదా గాలికి విగ్రహం కిందపడి ధ్వంసమై ఉంటుందని సీఐ చెప్పడంతో ఘటనా స్థలికి చేరుకున్న తెదేపా నేత పట్టాభిరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయకుండా ఎలా నిర్థారణకు వస్తారని ప్రశ్నించారు. సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి..

రామతీర్థంలో భాజపా దీక్ష భగ్నం



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని