మాయమైన 2.3కిలోల బంగారం స్వాధీనం
close

తాజా వార్తలు

Updated : 24/02/2021 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాయమైన 2.3కిలోల బంగారం స్వాధీనం

రామగుండం: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్లు పోలీసులకు భాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు ప్రయాణిస్తున్న కారు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాల మూలమలుపు వద్ద  రాజీవ్‌ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బంగారం వ్యాపారులు కొత్త శ్రీనివాస్‌, కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతిచెందారు. వీరితో పాటు కారులో ఉన్న సంతోష్‌కుమార్‌, సంతోష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో 108 వాహనంలో వీరిని గోదావరిఖనికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల వెంట రూ.కోటిపైచిలుకు విలువగల బంగారం ఉంది. 

108 సిబ్బంది బంగారాన్ని గుర్తించి రామగుండం ఎస్సై శైలజకు అప్పగించారు. బాధితుల వద్ద 3 కిలోల 300 గ్రాముల బంగారం లభించినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, వ్యాపారుల వద్ద ఉన్న మరో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. నిందితుల నుంచి 2 కిలోల 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని