close

తాజా వార్తలు

సాయి పల్లవి సర్‌ప్రైజ్‌ చేస్తుందా?

హైదరాబాద్‌: ఈ సంక్రాంతి పండగకు కథానాయిక సాయిపల్లవి అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారట. దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వెంకీమామ’ తర్వాత నాగచైతన్య ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో చైతన్య ఫస్ట్‌లుక్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన ఓ మధ్య తరగతి యువకుడి పాత్రలో కనిపించి, ఆకట్టుకున్నారు. ఇప్పుడు సాయిపల్లవి లుక్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

శేఖర్‌ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ‘ఫిదా’లో భానుమతిగా అలరించిన పల్లవి ఈ చిత్రంలో ఏ పాత్రతో ఆకట్టుకోబోతున్నారో చూడాలి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.