‘అధికారులను బెదిరించడం రాజ్యాంగ ఉల్లంఘనే’
close

తాజా వార్తలు

Updated : 07/02/2021 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అధికారులను బెదిరించడం రాజ్యాంగ ఉల్లంఘనే’

శాననమండలి ప్రతిపక్ష నేత యనమల 

అమరావతి: ఓటర్లను ప్రభావితం చేయడం, అధికారులను బెదిరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని శాననమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పంచాయతీలతో సంబంధం ఉండే ఆ శాఖా మంత్రి పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా జోక్యం చేసుకుంటారని మండిపడ్డారు. ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రతి రోజూ ఎస్‌ఈసీ, అధికారులపై ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారని నిలదీశారు. మంత్రులు కూడా పబ్లిక్‌ సర్వేంట్లే అని తెలిపారు. ఓ వైపు నామినేషన్లు వేస్తుంటే, మరో వైపు బెదిరిస్తూ ప్రకటనలు చేయడంపై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు ఇంతకన్నా పరాకాష్ఠ ఏముంటుందని దుయ్యబట్టారు. 

మంత్రుల వ్యవహారశైలిపై ఎస్‌ఈసీ జోక్యానికి వారే అవకాశం కల్పించారని యనమల అన్నారు. కోడ్‌ ఉల్లంఘిన వారు మంత్రి అయినా, పార్టీ కార్యకర్త అయినా చర్య తీసుకునే అధికారం ఎస్‌ఈసీదే అని స్పష్టం చేశారు. బలవంతపు ఏకగ్రీవాలను మంత్రులు ఎలా ప్రోత్సహిస్తారని నిలదీశారు. ఏదో విధంగా గెలవాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక 20 నెలల్లో వచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. వైకాపా మద్దతుదారులు గెలిస్తే భవిష్యత్తులోనూ నిధులను స్వాహా చేస్తారని ఆరోపించారు. 

ఇవీ చదవండి..
పెద్దిరెడ్డి పిటిషన్‌పై ముగిసిన విచారణ
గడప దాటనివ్వొద్దు
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని