Serum: ఆ కంపెనీలకు రక్షణ కల్పిస్తే మాక్కూడా..
close

తాజా వార్తలు

Published : 03/06/2021 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Serum: ఆ కంపెనీలకు రక్షణ కల్పిస్తే మాక్కూడా..

అందరికీ ఒకే నిబంధనలు ఉండాలన్న సీరమ్‌ సంస్థ

దిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం, కొవిషీల్డ్‌ తయారీ సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండెమ్నిటీ రక్షణ కోరుతోంది. ఈ మేరకు సంస్థ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఒకవేళ విదేశీ తయారీ సంస్థలకు చట్టపరమైన చిక్కుల నుంచి రక్షణ కల్పిస్తే సీరమ్‌తో దేశీయ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు కూడా అలాంటి రక్షణే ఇవ్వాలని కోరినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ‘‘రక్షణ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని సీరమ్ భావిస్తోంది’’అని తెలిపాయి. 

అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా సంస్థలు భారత్‌కు వ్యాక్సిన్లు అందించేందుకుగానూ ప్రభుత్వం నుంచి ఇండెమ్నిటీ కోరుతోన్న విషయం వెలిసిందే. అంటే.. ఈ సంస్థల టీకాల వల్ల ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహారాల అంశాలకు సంస్థలను బాధ్యులను చేయబోమంటూ ప్రభుత్వం రక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ కంపెనీకి ఇండెమ్నిటీ హామీ ఇవ్వలేదు. 
అయితే విదేశీ కంపెనీలకు ఇండెమ్నిటీ రక్షణ కల్పించేందుకు తమకు ఎలాంటి సమస్యా లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు నిన్న చెప్పడం గమనార్హం. ‘‘విదేశీ కంపెనీలు(ఫైజర్‌, మోడెర్నాలను ఉద్దేశిస్తూ) భారత్‌లో అత్యవసర వినియోగ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఆ సంస్థలకు అనుమతి ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అనేక దేశాలు వాటికి అలాంటి రక్షణ కల్పించాయి’’ అని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే సీరమ్‌ కూడా ఇండెమ్నిటీ కోరింది. 

మరోవైపు విదేశీ టీకాలు కేంద్రం మరిన్ని మినహాయింపులు కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారత నియంత్రణ సంస్థ అనుమతులు లేకుండానే విదేశీ టీకాల వినియోగానికి అనుమతినిచ్చిన కేంద్రం.. ఇప్పుడు వాటి వినియోగ అనుమతుల అనంతరం క్లినికల్‌ ట్రయల్స్‌(పోస్ట్‌ అప్రూవల్‌ బ్రిడ్జింగ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌) నిర్వహణ, బ్యాచ్‌ల వారీగా కేంద్ర ఔషధ ప్రయోగశాలలో చేపట్టాల్సిన అధీకృత తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని