స్పుత్నిక్‌ టీకా తయారీకి ‘సీరం’ సిద్ధం!
close

తాజా వార్తలు

Published : 03/06/2021 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్పుత్నిక్‌ టీకా తయారీకి ‘సీరం’ సిద్ధం!

అనుమతి కోసం డీసీజీఐకి దరఖాస్తు

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధం అయ్యింది. ఇందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా స్పుత్నిక్‌-వి ప్రయోగ ఫలితాల విశ్లేషణకు అనుమతిని కోరినట్లు సమాచారం.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు, సరఫరా చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం చేసుకుంది. ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి ఏప్రిల్‌లోనే డీసీజీఐ అనుమతి ఇచ్చింది. జులై నుంచి భారత్‌లోనే తయారు కానుంది. అంతలోపు రష్యా నుంచి స్పుత్నిక్‌-వి డోసులు దిగుమతి అవుతున్నాయి. తొలి దశలో 1.5లక్షల డోసులు, రెండో విడతలో 60వేల డోసులు వచ్చాయి. తాజాగా మూడో విడతలో దాదాపు 30లక్షల డోసులు రష్యా నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాయి.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిన నేపథ్యంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా జూన్‌ నెలలో 10కోట్ల కొవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించింది. వీటితో పాటు అమెరికాకు చెందిన నోవావాక్స్‌ డోసులను భారీ సంఖ్యలో అందుబాటులో తేనుంది. అయితే, ఇందుకు అమెరికా నియంత్రణ సంస్థల అనుమతుల కోసం వేచి చూస్తోంది. తాజాగా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను కూడా తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సన్నాహాలు చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని