close
Array ( ) 1

తాజా వార్తలు

పాఠశాలకు వెళ్తున్నందుకు బాలికను చంపేశారు!

పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని సన్పురా గ్రామంలో పాఠశాలకు వెళ్తోందన్న కారణంతో 17 ఏళ్ల ఆశ అనే బాలికను హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాలికలు అధికంగా చదువుకోకూడదనే ఓ సామాజిక వర్గంలో పుట్టిన ఆ అమ్మాయి వారికి ఎదురు తిరిగి చదువును కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆ బాలిక ఇంటికి వెళ్లిన ఆ సామాజిక వర్గానికి చెందిన ఏడుగురు వ్యక్తులు, ఆమె కుటుంబ సభ్యులను ఇంట్లో వేసి బయట గడియ పెట్టారు. అనంతరం ఆ బాలికను దారుణంగా హత్య చేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటనపై ఆశ సోదరుడు మోతీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

ఈ కేసుపై సోమవారం పోలీసు అధికారి మనోజ్‌ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఆ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో పాటు వారి ఇంటి చుట్టుపక్కల ఉండేవారు కలిసి ఇప్పటికే దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశాము. తీవ్రతర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. ఆ ప్రాంత డిప్యూటీ ఎస్పీ ‌ఈ ఘటనలో విచారణ జరుపుతున్నారు’ అని వివరించారు. ఆ ప్రాంతంలోని ఓ సామాజిక వర్గం వారు.. బాలికలు ఉన్నత పాఠశాల విద్య అభ్యసించడాన్ని ఒప్పుకోరని గ్రామంలోని ఓ వ్యక్తి తెలిపారు.   


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.