
తాజా వార్తలు
నాగశౌర్య సిక్స్ ప్యాక్ లుక్స్..!
వీడియోతో ఫిదా చేస్తున్న హీరో
హైదరాబాద్: బర్త్‌డే బాయ్ నాగశౌర్య.. ‘వరుడి’గా రెడీ అవుతున్నట్లున్నారు. తాజాగా ఆయన సిక్స్‌ప్యాక్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. గతేడాది విడుదలైన ‘అశ్వథ్థామ’ తర్వాత నాగశౌర్య వరుస ప్రాజెక్ట్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిల్లో ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ ఒకటి. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జంటగా రీతూవర్మ సందడి చేయనున్నారు. శుక్రవారం హీరో పుట్టినరోజు సందర్భంగా.. ‘వరుడు కావలెను’ టీమ్ నుంచి ఓ స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. చిత్రంలో శౌర్య ఎలా కనిపించనున్నారనేది ఈ వీడియోలో చూపించారు. వీడియో ఆరంభంలో శౌర్య సిక్స్ ప్యాక్ లుక్స్‌తో అభిమానులను ఫిదా చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.
ఇదీ చదవండి
రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!