సిద్ధార్థ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 02/02/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిద్ధార్థ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య

పోలీసులు గుర్తించడమే కారణం 
మరో నిందితుడు ఆత్మహత్యాయత్నం


 

తిరుపతి(కపిలతీర్థం), తిరుపతి(నేరవిభాగం): కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్‌ సమీప బంధువు సిద్ధార్థ దేవేందర్‌ హత్యకేసు నిందితుల్లో ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించగా, వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్య ఉదంతాన్ని కర్ణాటక  పోలీసులు గుర్తించడంతోనే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి..

తిరుపతి కొర్లగుంటకు చెందిన చెన్నారెడ్డి కుమారుడు శ్యాంసుందర్‌రెడ్డి (28) బీటెక్‌ పూర్తి చేశాడు. 2014 నుంచి ఉద్యోగాల పేరుతో చెన్నై, బెంగళూరు తిరుగుతున్నాడు. అదే సమయంలో బెంగళూరులో ఉన్న తన స్నేహితుడు, తిరుపతి కొర్లగుంట ప్రాంతానికి చెందిన వినోద్‌ వద్దకు వెళ్లి గత కొంతకాలంగా అక్కడే ఉన్నాడు. వారం రోజుల కిందట వీరిద్దరూ తిరుపతికి చేరుకున్నారు. అయితే గత నెల 19వ తేదీ నుంచి కనబడని సిద్దార్థ దేవేందర్‌ హత్యకు గురైనట్లు.. అందులో వీరు పాత్రదారులని పోలీసులు గుర్తించినట్లు పసిగట్టారు. పోలీసులు ఇంటికి వస్తారని భయపడి ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి - రేణిగుంట మార్గంలోని రైలు కిందపడటానికి వినోద్‌ యత్నించగా రైలు వేగానికి పక్కకు పడ్డాడు. కాలు, చేయి విరగడంతో స్థానికులు, కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు అక్కడికి చేరుకుని వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్యాంసుందర్‌రెడ్డి మాత్రం నాలుగు రోజుల కిందటే తిరుపతి శ్రీనివాసం వెనుక ఉన్న తాళ్లపాక చెరువు ముళ్ల పొదల్లోని చెట్లుకు తన చొక్కాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లిన స్థానికులు గుర్తించి తిరుపతి తూర్పు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ ఇమ్రాన్‌ బాషా ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన కుమారుడు గత నెల 22వ తేదీన ఫోన్‌ చేసి ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో స్థిరపడలేదనే ఆవేదన వ్యక్తం చేసినట్లు శ్యాంసుందర్‌రెడ్డి తండ్రి  పోలీసులతో చెప్పారు. అయితే సిద్ధార్థ హత్య కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని