
తాజా వార్తలు
అంతర్రాష్ట సిమ్‌స్వాప్ ముఠా అరెస్టు
హైదరాబాద్: సిమ్ స్వాప్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఈ ముఠా పదేళ్లుగా మొబైల్ నంబర్లను స్వాప్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ముఠా సభ్యులు వివిధ సంస్థల ఆర్థిక లావాదేవీల ఫోన్ నంబర్లను సేకరించి స్వాప్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మొబైల్ సిమ్‌లను బ్లాక్ చేసి నిందితులు నగదు కాజేస్తున్నట్లు సజ్జనార్ వివరించారు. నిందితుల వద్ద ఉన్న 40 ఆధార్ కార్డులను సీజ్ చేసినట్లు చెప్పారు. ముఠాకు కొందరు సిమ్ విక్రయదారులతో పరిచయాలున్నాయని, వారి ద్వారా వినియోగదారులు వివరాలు సేకరించి దోపిడీకి పాల్పడుతున్నారని సీపీ వివరించారు.
ఇవీ చదవండి..
కారెక్కాడు... నగల దొంగ చిక్కాడు
Tags :