close

తాజా వార్తలు

Updated : 27/02/2021 21:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మమ్మల్ని గెలిపిస్తే బెంగాల్‌లో ఒకేవిడత ఎన్నికలు’

ఎంపీ దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఎన్నికలపై సీఎం మమతా బెనర్జీ ప్రశ్నలు లేవనెత్తడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ స్పందించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో బెంగాల్‌లో రాజకీయ హింస చెలరేగుతున్న వేళ ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తమ పార్టీని గెలిపిస్తే ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ హింస చెలరేగుతోందని, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ఎనిమిది విడతల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కోల్‌కతాలో చాయ్‌ పే చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకే దశలో ఎన్నికలు జరగడం గర్వకారణంగా ఉంటుందని తెలిపారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే హింస, భయం లేని రాష్ట్రంగా బెంగాల్‌ను తీర్చిదిద్దుతామన్నారు. దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగత్‌రాయ్‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోగలదా?అని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థల నిర్ణయాలను భాజపా ప్రభావితం చేస్తోందని సీపీఎం నేత సుజన్‌ చక్రవర్తి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికలు ఎన్ని విడతల్లో జరపాలో రాజకీయ పార్టీ నిర్ణయిస్తుందా? అని ప్రశ్నించారు.

ఎనిమిది విడతల్లో ఎన్నికలపై మమత ఏమన్నారు?

‘‘పశ్చిమబెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడమేంటి? ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల సూచనల మేరకే ఈసీ ఈ తేదీలను ప్రకటించిందా? ఎన్నికల సంఘంపై గౌరవంతోనే చెబుతున్నా.. ఇతర రాష్ట్రాల్లో ఒక్క దశలోనే ఎన్నికలు నిర్వహిస్తూ.. బెంగాల్‌లో మాత్రం ఇన్ని దశల్లో ఎందుకు చేపడుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు ఈసీ న్యాయం చేయకపోతే వారు ఎక్కడికి వెళ్లాలి? బెంగాల్‌ను ఈసీ తన సొంత రాష్ట్రంగానే పరిగణించాలి. భాజపా కోరుకున్నట్లే ఎన్నికల తేదీలున్నట్లు నాకు సమాచారం ఉంది. ఎవరెన్ని ‘ట్రిక్కు’లు ప్రదర్శించినా గెలుపు మాదే’’ అని మమత వ్యాఖ్యానించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని