కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి
close

తాజా వార్తలు

Updated : 22/04/2021 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి

దిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి (34) కరోనా వైరస్‌ బారిన పడి గురువారం మృతి చెందారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి స్వయంగా ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించారు.

‘ఈ విషయం తెలియజేయడానికి ఎంతో బాధగా ఉంది. కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి నా పెద్ద కొడుకు ఆశిష్‌ ఈ ఉదయం మృతి చెందారు. మా కుమారుడిని బతికించేందుకు శ్రమించి చికిత్స అందించిన వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి, ఈ ఆపత్కాలంలో మాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ఏచూరి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ సంతాపం

ఆశిష్‌ ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ బాధాకర సమయంలో ఏచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.  సీపీఎం పొలిట్‌బ్యూరోతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని