
తాజా వార్తలు
అగ్నిప్రమాదంలో ఆరుగురు కొవిడ్ బాధితులు మృతి
(ప్రతీకాత్మక చిత్రం)
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిల్లో చెలరేగిన మంటల్లో ఆరుగురు కొవిడ్-19 బాధితులు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున రాజ్‌కోట్‌లోని మావ్‌డీ ప్రాంతంలో ఉన్న శివానంద్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న మరో 27 మంది కరోనా బాధితులను సురక్షితంగా కాపాడి సమీపంలోని మరో కొవిడ్ చికిత్సా కేంద్రానికి తరలించారు. మహమ్మారి బారిన పడ్డ మొత్తం 33 మందికి ఇక్కడ చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ఏడుగురు ఐసీయూలో ఉండగా.. ఆరుగురు తాజా ప్రమాదంలో మరణించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు