
తాజా వార్తలు
ఆర్జీవీతో అరియానా.. చెమటోడుస్తున్న తమన్నా..
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: నటి చార్మికౌర్ చింత మొత్తం తన కుక్కపిల్ల గురించే. 45రోజుల వయసున్న శునకం.. మెట్లు ఎక్కేందుకు కూడా భయపడుతోందంటూ ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది.
* మీ ప్రవర్తనలో ఉప్పుందా అంటోంది తెలుగమ్మాయి తేజస్వి మడివాడ.. ఒక అందమైన బ్లాక్అండ్వైట్ ఫొటో పంచుకుందామె.
* మైండ్ ఏం నమ్ముతుందో శరీరం అదే సాధిస్తుంది అంటూ మిల్కీబ్యూటీ తమన్నా ఒక పోస్టు చేసింది. జిమ్‌లో వర్కౌట్ సందర్భంగా తీసిన ఫొటోను పంచుకుంది.
* బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ గోవాలో షికార్లు చేస్తోంది. తన అభిమాన డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుందామె.
* నటుడు సత్యదేవ్ తన భార్య, కుమారుడితో కలిసి దిగిన ఒక ఫొటోను పంచుకున్నాడు. ‘సవర్నిక్ పుట్టి నేటికి ఏడాది పూర్తి’ అంటూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.
Tags :