
తాజా వార్తలు
జెన్నీ సన్నద్ధం.. ఐస్‌క్రీమ్ ఆనందం.. మంచు మీమ్
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: లండన్ ఫ్యాషన్ వీక్ కోసం జెన్నీఫర్ సన్నద్ధమవుతోంది. ఇంతకీ జెన్నీఫర్ ఎవరా అని ఆలోచిస్తున్నారా..? అదేనండి ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సరసన కనిపించే పాత్ర పేరది. అందులో హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తోంది.
* నటి మంచు లక్ష్మి తనపై వచ్చిన మీమ్ చూసి తెగ సంబరపడుతున్నారు. నటనలో తనను తన తండ్రి మోహన్‌బాబుతో పోలుస్తూ.. సోషల్ మీడియాలో వచ్చిన ఒక మీమ్‌ను ఆమె పంచుకున్నారు.
* ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్‌కు సూర్యరశ్మి.. గుమ్మడికాయ జ్యూస్ కావాలట. అందంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పదు మరి అని అంటోందామె.
* కప్‌కేక్ చూడగానే ముఖంపై చిరునవ్వు వస్తుందంటోంది పాయల్. ఐస్‌క్రీమ్ చేతిలో పట్టుకొని ఆమె ఫొటోలకు పోజులిచ్చింది.
ఇవీ చదవండి
Tags :