
తాజా వార్తలు
రాశీఖన్నా వింతకోరిక.. సారా డైలీడోస్
సోషల్లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటోందట ఏంజెల్ ఆర్న. ‘ఏదో మార్చడానికి కాదు. ఈ అందమైన రోజు లాగా.. కొన్ని విషయాలను రెండుసార్లు ఆస్వాదించడానికి’ అని అంటోంది. ఇంతకీ ఈ ఆర్న ఎవరనుకుంటున్నారా..? అదేనండి ‘ప్రతిరోజు పండగే’ హీరోయిన్ రాశీఖన్నా.
* ‘మీ పరిమితులను విస్తరించండి’ అని పాఠాలు చెబుతోంది ప్రముఖ నటి, భరతనాట్యం డ్యాన్సర్ శోభన. ఓ నాట్య భంగిమను ఇన్స్టాగ్రామ్లో పంచుకుందామె.
* మనం ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్ రంగులో చూడకపోవడానికి ఒక కారణం ఉందంటోంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.
* మీ డైలీ డోస్ విటమిన్-సి అంటూ బాలీవుడ్ చిన్నది సారా అలీఖాన్ ఒక ఫొటో పంచుకుంది.
* జీవితంలో వెలుగు ఉన్న వైపే చూస్తున్నా అంటూ శ్రద్ధాదాస్ ఒక ఫొటో పంచుకుంది.
* బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి ఓ ఫొటోను షేర్ చేసింది. మధుబాల పాత్ర పోషించడం తనకు ఎంతో గర్వకారణమంటూ ఆమె మురిసిపోతోంది.