సోనూను ఇక విలన్‌గా చూడలేను
close

తాజా వార్తలు

Updated : 28/07/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూను ఇక విలన్‌గా చూడలేను

మాజీ మంత్రి సోమిరెడ్డి

అమరావతి : రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ పంపి రియల్‌ హీరోగా నిలిచిన సోనూసూద్‌ను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభినందించారు. ఇకపై సోనూ సూద్‌ను విలన్‌గా చూడలేనన్నారు. సినిమాల్లో హీరోపాత్ర వేయాల్సిందేనన్నారు. టాటా, మహీంద్రా, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం అన్నారు. అయితే ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదని కొనియాడారు. వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్‌, విదేశాల్లో ఉన్న విద్యార్థుల విషయంలో సోనూసూద్‌ చొరవ అభినందనీయమన్నారు. మరోవైపు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా సోనూసూద్‌ను ట్విటర్‌లో అభినందించారు. 

రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ అందించి సాయం చేసిన బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందించిన విషయం తెలిసిందే. నాగేశ్వరరావు ఇద్దరు కుమార్తెల చదువు బాధ్యతలు తాను తీసుకోనున్నట్లు ట్విటర్‌ ద్వారా చంద్రబాబు తెలియజేశారు. 

ఇవీ చదవండి..

ఆ రైతింట సోనూలిక ట్రాక్టర్‌

సోనూసూద్‌కు చంద్రబాబు అభినందన


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని