బెదిరింపులకు భాజపా భయపడదు: సోము
close

తాజా వార్తలు

Updated : 19/03/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెదిరింపులకు భాజపా భయపడదు: సోము

తిరుపతి: వైకాపా నేతల బెదిరింపులకు భాజపా భయపడదని.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలోని లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో సోము మాట్లాడారు. వైకాపా దౌర్జన్యాలను ఎదుర్కోగల ధైర్యం భాజపాకు మాత్రమే ఉందన్నారు. ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడకుండా వైకాపా ఏ ఎన్నికల్లోనైనా విజయం సాధించిందా? అని ప్రశ్నించారు. కొంతమంది ప్రభుత్వాధికారులు వైకాపా కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి అజెండాగా తిరుపతి ఉపఎన్నికకు జనసేనతో కలిసి ప్రచారం నిర్వహిస్తామని.. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోనే ప్రజల్లోకి వెళ్తామని ఆయన వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని