గొడ్డలితో తల్లిని నరికి చంపిన కొడుకు
close

తాజా వార్తలు

Published : 17/04/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గొడ్డలితో తల్లిని నరికి చంపిన కొడుకు

గోపాలపేట: తెలంగాణలోని వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని గోపాలపేట మండలం పొలికెపాడులో కన్న తల్లిని ఓ తనయుడు గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హతమార్చాడు. అత్తా కోడళ్ల మధ్య తలెత్తిన వివాదం తారస్థాయికి చేరడంతో ఆగ్రహావేశంతో ఉన్న కుమారుడు గొడ్డలితో తల్లిని నరికి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన మంకలి నర్సయ్య, కాశమ్మ దంపతులకు కురుమయ్య, శివ ఇద్దరు కుమారులున్నారు. శివకు ఎనిమిది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన రేణుకతో వివాహం జరిగింది. ఇటీవల అత్త కాశమ్మకు, కోడలు రేణుక మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో మనస్తాపం చెందిన కాశమ్మ ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుంది. ఇది గమనించిన కోడలు అత్త చేతిలోని అగ్గిపెట్టె లాక్కొని నిలువరించింది. ఈ తరుణంలో ఆవేశానికి లోనైన కాశమ్మ కుమారుడు శివ ఇంట్లో ఉన్న గొడ్డలితో తల్లి మెడపై నరికాడు. ఆమె కుప్పకూలి రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న ఎస్సై రామన్‌ గౌడ్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు శివ, ఆయన భార్య రేణుకను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్‌, సీఐ సూర్య నాయక్‌ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని