భాజపా ఎంపీ కుమారుడి కాల్పుల నాటకం..!
close

తాజా వార్తలు

Updated : 03/03/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా ఎంపీ కుమారుడి కాల్పుల నాటకం..!

లఖ్‌నవూ: భాజపా నేత, లోక్‌సభ సభ్యుడు కౌశల్‌ కిశోర్‌ కుమారుడు ఆయుష్‌పై కాల్పులు జరిగాయి. లఖ్‌నవూలోని మదియావా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయుష్‌ తన బంధువుతో కలిసి బయటకు వెళ్లగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఎంపీ కుమారుడి ఛాతీ, భుజానికి గాయమైంది. 

అయితే ఈ కాల్పుల ఘటన నాటకమేనని తెలుస్తోంది. తన ప్రత్యర్థులను ఇరికించేందుకు ఆయుష్‌ తనపై తానే దాడి చేయించుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. ఆయుష్‌పై తన బావ ఆదర్శ్‌ కాల్పులు జరిపినట్లు తేలింది. దీంతో అతడిని అరెస్టు చేసి విచారించారు. 

కాగా.. విచారణలో అతడు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎంపీ కుమారుడిపై కాల్పులు జరిపింది తానే అని అంగీకరించిన ఆదర్శ్‌.. ఇదంతా ఆయుష్‌ ప్లాన్‌లో భాగమేనని చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తన ప్రత్యర్థి అయిన ఓ వ్యక్తిని ఇరికించేందుకు ఆయుషే తనతో ఈ పని చేయించాడని ఆదర్శ్‌ చెప్పాడు. దర్యాప్తులో భాగంగా ఎంపీ కుమారుడి ఇంట్లో ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బుల్లెట్‌ గాయాలకు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ఆయుష్‌.. రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఆయుష్‌ తండ్రి కౌశల్‌ కిశోర్‌ యూపీలోని మోహన్‌లాల్‌ గంజ్‌ లోక్‌సభ నియోకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తల్లి జయ దేవి మలిహాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయుష్‌ తన భార్యతో కలిసి విడిగా ఉంటున్నాడని, కాల్పుల ఘటన ఎలా జరిగిందో తనకు తెలియదని ఎంపీ వెల్లడించారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని