close

తాజా వార్తలు

Published : 26/07/2020 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆన్‌లైన్‌ వేధింపులపై సోనాక్షి గళం

‘మిషన్‌ జోష్‌’ ప్రారంభించిన నటి

ముంబయి: ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఆన్‌లైన్‌ వేధింపులు ఒకటి. వ్యక్తుల ఫొటోలను అశ్లీలంగా మార్చడం, అసభ్య కామెంట్లు పెట్టడం, బెదిరింపులు, వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంతో ఆన్‌లైన్‌ వేధింపులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందంటున్నారు బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా. ఆన్‌లైన్‌ వేధింపులను నివారించడం కోసం ఆమె మహారాష్ట్ర పోలీసులతో చేతులు కలిపారు. ‘మిషన్‌ జోష్‌’ పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోనాక్షి ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

‘‘ఆన్‌లైన్‌ వేధింపులను అంతం చేసేందుకు ‘మిషన్‌ జోష్‌’ పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. ఇందుకోసం స్పెషల్‌ ఐజీపీ ప్రతాప్‌ దిఘవ్‌కర్‌తో చేతులు కలిపాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆన్‌లైన్‌ వేధింపులపై అవగాహన కల్పించబోతున్నాం. ఆన్‌లైన్‌ వేధింపులు బాధితుల మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతాయో తెలియజేస్తాం. ఇక చాలు. ఆన్‌లైన్‌ వేధింపులు ఉండకూడదు’’ అంటూ సోనాక్షి తన పోస్టుకు కాప్షన్‌ ఇచ్చారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.