Sonu Sood: 22 మంది ప్రాణాలు కాపాడిన టీం!
close

తాజా వార్తలు

Published : 05/05/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonu Sood: 22 మంది ప్రాణాలు కాపాడిన టీం!

బెంగళూరు: దేశంలో కరోనా సంక్షోభం వేళ అభాగ్యులకు అండగా నిలుస్తూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు సోనూసూద్‌. అడిగిన వెంటనే సాయమందిస్తూ కష్టకాలంలో ఎందరికో దన్నుగా నిలిచారు. కర్ణాటకలోని సోనూసూద్‌ బృందం మంగళవారం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 20 నుంచి 22 మంది రోగుల ప్రాణాలను కాపాడింది. బెంగళూరులోని అరక్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని.. అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలంటూ సత్యనారాయణన్‌ అనే ఓ పోలీసు అధికారి కర్ణాటకలోని సోనూసూద్‌ బృందానికి అత్యవసర సందేశం (ఎస్‌ఓఎస్‌) పంపారు. ఆ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక అప్పటికే ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 నుంచి 22 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

అత్యవసర సందేశం అందుకున్న వెంటనే స్పందించిన సోనూసూద్‌ బృందం కొన్ని నిమిషాల్లోనే అరక్‌ హాస్పిటల్‌కి 16 ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచింది. కాగా వాలంటీర్ల కృషిని సోనూసూద్‌ ప్రశంసించారు.  ‘ఇది టీంవర్క్‌కు నిదర్శనం. ఇలాగే పనిచేస్తూ దేశ ప్రజలకు అండగా ఉంటాం. ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ నుంచి సందేశం రాగానే.. పరిస్థితిని ధ్రువీకరించుకొని కొన్ని నిమిషాల్లోనే ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచాం. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే ఎన్నో కుటుంబాలు వారి కుటుంబీకులను కోల్పోయేవారు. వారిని కాపాడిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని సోనూసూద్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని