Sonu Sood:వాళ్లకి ఉచిత విద్య అందించండి
close

తాజా వార్తలు

Updated : 30/04/2021 12:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonu Sood:వాళ్లకి ఉచిత విద్య అందించండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోనూ విజ్ఞప్తి

ముంబయి: కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ కోరారు. కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేస్తోన్న ఆయన తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. దేశంలో నానాటికీ విజృంభిస్తోన్న కరోనా బారిన పడి ఎంతోమంది మృతి చెందుతున్నారని.. దాని వల్ల వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారతోందని సోనూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఎనిమిది నుంచి 12 సంవత్సరాలు వయస్సున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోతున్నారు. అలాంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. కాబట్టి ఆ చిన్నారులకు అండగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సంబంధిత ఎన్జీవోలను కోరుతున్నాను. అలాగే, ప్రాథమిక స్కూల్‌ నుంచి కళాశాల వరకూ వాళ్లకు ఉచిత విద్య అందించాలని అభ్యర్థిస్తున్నాను’ అని సోనూ విజ్ఞప్తి చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని