SonuSood: కన్నీళ్లు పెట్టుకున్న రియల్‌హీరో
close

తాజా వార్తలు

Published : 30/04/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SonuSood: కన్నీళ్లు పెట్టుకున్న రియల్‌హీరో

వైరల్‌గా మారిన వీడియోలు

ముంబయి: గతేడాది లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటివరకూ ఎంతోమందికి అపన్నహస్తం అందించి రియల్‌ హీరోగా సమాజానికి స్ఫూర్తినిచ్చారు నటుడు సోనూసూద్‌. పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. కాగా, తాజాగా ఆయన ప్రముఖ డ్యాన్స్‌ రియాల్టీ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా సోనూసూద్‌ చేస్తోన్న సేవలను కొనియాడుతూ డ్యాన్స్‌షోలోని కంటిస్టెంట్స్‌ ఓ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. వలస కార్మికులకు భోజనం అందించడం, వాళ్ల కోసం ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అలాగే ఎంతోమంది పేదవాళ్లకు ఉపాధి కల్పించడం, మందులు, ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ.. ఇలా సోనూ చేసిన ఎన్నో మంచి పనులతో సాగిన ఈ ప్రత్యేక ప్రదర్శన ఆద్యంతం భావోద్వేగంగా సాగింది.

కాగా, ప్రదర్శన ముగిసే సమయానికి సోనూ ఎమోషనలై కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు, ఇటీవల ఆయన భారతి అనే ఓ కొవిడ్‌ బాధితురాలిని నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా చేర్చి ప్రత్యేక చికిత్స ఇప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారతి కుటుంబసభ్యులు సోనూకి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో సందేశం పంపించారు. అది చూసిన ఆయన కళ్లు చమ్మగిల్లాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.





Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని