
తాజా వార్తలు
ఎస్పీబీ ఆరోగ్యంపై ఎంజీఎం హెల్త్ బులిటెన్
చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఎక్మో సహాయంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
‘‘కరోనాతో బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు చికిత్స కొనసాగుతోంది. వెంటిటేలర్, ఎక్మో సహాయంతో ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగా ఉంది. మా వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. అదే విధంగా ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం’’ అని పేర్కొంది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా స్పందించారు. ‘‘గురువారం నాన్నగారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండగా, ఇప్పుడు స్థిరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అంటే దీనర్థం ఆయన పూర్తిగా కోలుకున్నారని కాదు. అయితే, వైద్యుల బృందం మాత్రం ఆయన ఆరోగ్యం మెరుగుపడే విషయమై ఎంతో నమ్మకంతో ఉంది. మీ అందరి ప్రార్థనల వల్ల నాన్న ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఈ పరిణామం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మా కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
