close

తాజా వార్తలు

Updated : 07/09/2020 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్‌

చెన్నై: సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా వీడియోను పంచుకున్నారు.

‘‘నాన్న ఆరోగ్యం గురించి వారాంతంలో అప్‌డేట్‌ ఇవ్వకలేకపోయా క్షమించండి. గతంతో పోలిస్తే, నాన్న ఊపిరితిత్తుల పనితీరు మెరుగవడంతో వెంటిలేటర్‌ తొలగిస్తారని మేము భావించాం. అయితే, ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్‌ఫెక్షన్‌ ఉండటంతో తీయలేదు. శుభవార్త ఏంటంటే, తాజాగా చేసిన పరీక్షల్లో నాన్నకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఇక్కడ పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ అన్నది సమస్య కాదు. నాన్న ఊపిరితిత్తులు త్వరగా మెరుగవ్వాలి. అయితే, ఇందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది.  వారాంతంలో అమ్మానాన్నల వివాహ వార్షికోత్సవం ఉండటంతో చిన్న సెలబ్రేషన్స్‌ చేశాం. నాన్న తన ఐపాడ్‌లో క్రికెట్‌, టెన్నిస్‌ చూస్తున్నారు. ఐపీఎల్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫిజియోథెరపీ కొనసాగుతోంది. నాన్న కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రార్థనలు ఇలాగే కొనసాగాలి.’’ అని ఎస్పీ చరణ్‌ అన్నారు.

కరోనాతో పోరాడుతూ ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన