
తాజా వార్తలు
ఎస్పీబీ తాజా ఆరోగ్యంపై చరణ్ ఏమన్నారంటే?
చెన్నై: కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఇంట్లోనే మందులు వాడుతున్నారని తెలిపారు.
‘‘మా అమ్మ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆమె ఇంటికి వచ్చారు. ప్రస్తుతం మందులు వాడుతున్నారు. నిన్నా ఈరోజూ,నేను ఆస్పత్రికి వెళ్లాను. నాన్న ఆరోగ్యం గురించి వైద్యులు నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. ఆయన ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉందని తెలిపారు. కొన్ని రోజులుగా మంచానికే పరిమితం కావడంతో కండరాల పునరుత్తేజానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఆయన ఊపిరి తీసుకోవడం కూడా మెరుగుపడింది. మీ ప్రార్థనలు, దీవెనల వల్ల ఆయన త్వరగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఇంటికి వస్తారని ఆశిస్తున్నా. రేపటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత సడలించనున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్‌లు పెట్టుకొని, భౌతికదూరం పాటించండి. వైరస్ బారినపడిన ప్రతి ఒక్కరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఎస్పీ చరణ్ అన్నారు.
మరోవైపు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు కూడా ఎస్పీబీ ఆరోగ్యంపై హెల్త్‌బులిటెన్ విడుదల చేశాయి. ఇంకా ఆయన ఐసీయూలోనే ఉన్నారని, వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యుల చికిత్సకు, ఫిజియోథెరపీకి ఆయన చురుగ్గా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
