close

తాజా వార్తలు

Published : 27/08/2020 17:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాన్నకు ఫిజియోథెరపీ చేశారు: ఎస్పీ చరణ్‌

చెన్నై: కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. గురువారం ఎస్పీ బాలుకి వైద్యులు ఫిజియోథెరపీ చికిత్స కూడా చేసినట్లు పేర్కొన్నారు.

‘‘ఆస్పత్రి వర్గాలు చెప్పిన దాని ప్రకారం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఫిజియోథెరపీ చికిత్స కూడా అందించారు. అయితే, నాన్నను నేను చూడలేదు. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. నాన్న ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు, వైద్యుల కృషి అనిర్వచనీయం. వారికి కృతజ్ఞతలు. అదే సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో మరిన్ని అప్‌డేట్‌లు ఇస్తా’’ అని ఎస్పీ చరణ్‌ అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన