
తాజా వార్తలు
ఎస్పీబీకి నెగటివ్: అసత్యమన్న ఎస్పీ చరణ్
చెన్నై: తాజాగా చేసిన పరీక్షల్లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నెగటివ్ వచ్చిందంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.
‘‘అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించిన వైద్య బృందాన్ని సంప్రదించిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ హెల్త్ అప్డేట్లను మీతో పంచుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ ఈ ఉదయం నుంచి ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. నాన్న ఆరోగ్యం గురించి మొట్టమొదటిగా సమాచారం పొందే ఏకైక వ్యక్తి నేనే. ఆ సమాచారాన్నే నేను మీడియాతో పంచుకుంటున్నా. నాన్నగారికి కొవిడ్ నెగటివ్ వచ్చినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కరోనా నెగటివా? పాజిటివా? అన్న విషయం పక్కన పెడితే, ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటికీ ఆయనకు వైద్యులు వెంటిలేటర్, ఎక్మోసాయంతో చికిత్స అందిస్తున్నారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇది ఇలాగే ఉంటే, ఆయన ఊపిరితిత్తులు మరింత కోలుకునే అవకాశం ఉంది. దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. వైద్యులతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం నేనే అప్డేట్ ఇస్తా. ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
కరోనాతో పోరాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్, ఎక్మోసాయంతో చికిత్స అందిస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
