ఆ జలపాతంపై రెండు పల్టీలు కొట్టిన తొలివ్యక్తి
close

తాజా వార్తలు

Published : 09/04/2021 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ జలపాతంపై రెండు పల్టీలు కొట్టిన తొలివ్యక్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్పెయిన్‌ సాహస యాత్రికుడు యానియోల్‌ సెర్రాసలోస్‌ అరుదైన ఘనత సాధించాడు. స్కేటింగ్‌ బోట్‌ను తలపించే కయాక్‌పై మంచుకొండ నుంచి జలపాతం మీదుగా భూమిపైకి చేరే క్రమంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. జలపాతంపై 360 డిగ్రీల్లో రెండు పల్టీలు కొట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించాడు. చిలీలోని ఓ మంచు పర్వతంపై నుంచి గంటకు 60 మైళ్ల వేగంతో కిందకు దూసుకొచ్చిన యానియోల్‌.. అడవులు, సెలయేళ్లు, జలపాతాల మీదుగా తన ప్రయాణాన్ని సాగించాడు. ఈ క్రమంలో విల్లారికా అగ్నిపర్వతాన్ని సైతం దాటి ముందుకు దూసుకెళ్లిన అతడు జలపాతంపై డబల్‌ ఫ్లిప్‌ సాధించాడు. ఈ సాహస యాత్రికుడి ప్రయాణాన్ని అద్భుత రీతిలో చిత్రీకరించారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని