close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 06/02/2020 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అభిమానులూ.. అర్థం చేసుకోండి: శ్రీముఖి

హైదరాబాద్‌: బుల్లితెరపై తనదైన నటనతో అలరిస్తున్న వ్యాఖ్యాత శ్రీముఖి. ‘బిగ్‌బాస్‌’కు వెళ్లి వచ్చిన తర్వాత ఆమెకు పాపులారిటీ మరింత పెరిగింది. కెమెరా ముందు ఆమె నటన, చలాకీతనానికి ఎందరో అభిమానులు ఫిదా అయిపోయారు. శ్రీముఖిని కలవాలని, మాట్లాడాలని, ఆమెతో ఫొటో దిగాలని ఎందరో ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు ఏకంగా ఆమె ఇంటి వద్దే గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఈరోజు కొందరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి ఫొటో దిగాలని అడగడంతో ఆమె కాస్త అసహనానికి గురయ్యారు. జరిగిన ఘటనకు క్షమాపణలు చెబుతూ, తన మనసులోని మాటలను అభిమానులకు తెలిపారు.

‘‘మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. ఇలాంటి విషయాలు చెప్పేందుకు లైవ్‌కు వస్తున్నా అని ముందు చెప్పి రాలేము. చాలా మంది ఫలానా సమయానికి లైవ్‌కు వస్తామని ముందే చెబుతారు. అప్పుడు వారితో చాట్‌ చేయొచ్చు.. సరదాగా మాట్లాడుకోవచ్చు. కానీ, ఇది అలాంటి లైవ్‌ కాదు. నేను  ‘బిగ్‌బాస్‌’ హౌస్‌ నుంచి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే చాలా మంది ‘మీరంటే ఇష్టం.. హౌస్‌లో మీ పెర్ఫామెన్స్‌, మీ తీరు నచ్చింది. మిమ్మల్ని కలవాలి. ఫొటోలు దిగాలి’ అంటుంటే బాగుంటుంది. ఈ విషయాన్ని గురించి గతంలో రెండు మూడు సార్లు నేను ప్రస్తావించాను. బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఉంటున్నానో చాలా మంది తమ స్నేహితుల ద్వారా తెలుసుకుని ఇంటికి వచ్చేస్తున్నారు. సమయం, సందర్భం ఏవీ చూసుకోవడం లేదు. మమ్మల్ని ప్రేమించే అభిమానులు ఉండటం నిజంగా అదృష్టం. అలాంటి అభిమానుల కోసమే మేము మేకప్‌లు వేసుకుని టీవీ ముందుకు వచ్చి మిమ్మల్ని అలరిస్తున్నాం. మాకు ఇంతటి పేరు వచ్చిందంటే కూడా అది మీ వల్లే’’

‘‘ప్రతి వ్యక్తికి ప్రైవసీ అనేది ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా, కొందరు వ్యక్తులు ఇంటికి వచ్చేస్తున్నారు. నా కోసం వేచి చూస్తున్నారు. ‘మేము విజయవాడ నుంచి వచ్చాం.. వరంగల్‌ నుంచి వచ్చాం.. మీతో ఫొటో దిగాలి’ అంటున్నారు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చిన దగ్గరి నుంచి ఇదే జరుగుతోంది. అమ్మాయిలు,  అబ్బాయిలు కూడా నా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. నేను ఎలా స్పందించాలో అర్థం కావటం లేదు. నేనెవరో మీ అందరికీ తెలుసు. కానీ, మీలో చాలా మంది నాకు తెలియదు. ముందుగా నా సహాయకులకు సమాచారం ఇచ్చి, ‘మిమ్మల్ని కలుస్తారట’ అంటే అందుకు సిద్ధం కావచ్చు. కానీ, సడెన్‌గా వచ్చిన ఫొటోలు దిగుతామని అంటున్నారు’’

‘‘ప్రస్తుతం ఒక టెలివిజన్‌ కోసం షో చేస్తున్నా. నిన్న మూడు ఎపిసోడ్‌లు పూర్తయ్యే సరికి రాత్రి 3గంటలు అయింది. మళ్లీ ఉదయాన్నే నిద్రలేచి షూటింగ్‌కు వచ్చేశా. తీరిక లేకుండా సమయం గడుపుతూ ఉంటాను. నిత్యం ఒత్తిడితో ఉంటాం. కొన్నిసార్లు మా మానసిక స్థితి సరిగా ఉండదు. అవేవీ పట్టించుకోకుండా ఈ రోజు ఉదయాన్నే మా ఇంటికి వచ్చి,‘అక్కా.. మేం వచ్చాం.. ఫొటో దిగుతాం’ అని అడిగారు. నేను ఆశ్చర్యపోయా. వెంటనే కారు ఎక్కి వచ్చేశా. మీరు నిజంగా నా అభిమానులే అయి ఉండవచ్చు. అయితే, మాకు కూడా కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా! దాన్ని అర్థం చేసుకోండి. మీరు నన్ను కలవాలనుకుంటే అందుకు వేరే మార్గం ఉంటుంది. ముందుగా నాకు సమాచారం ఉంటే మీతో ఫొటోనే కాదు, కొంచెసేపు మాట్లాడతా. ప్రతి ఒక్కరికీ స్పెషల్‌ సెల్ఫీ ఇస్తా. నా కోసం ఊళ్ల నుంచి రావొద్దు. నా కోసం గంటల తరబడి వేచి ఉండద్దు. చాలా బాధగా ఉంటోంది. ఈ విషయాన్ని చెప్పడానికి కాస్త బాధగా ఉంది. అయినా తప్పడం లేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈరోజు నా కోసం వచ్చిన వారికి క్షమాపణ చెబుతున్నా. మీ  అభిమానానికి ధన్యవాదాలు. ’’ అని ఇన్‌స్టా వేదికగా శ్రీముఖి అభిమానులకు విజ్ఞప్తి చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.