close

తాజా వార్తలు

Updated : 19/10/2020 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాభాల్లో ముగిసిన మార్కెట్లు: కారణాలివే!

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 448 పాయింట్లు లాభపడి, 40,431 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 11,873 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.37గా ఉంది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 318 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 82 పాయింట్లతో ముందుకు కదలాడింది.ఫైనాన్షియల్‌, మెటల్‌ షేర్ల అండతో ఒకానొక దశలో సెన్సెక్స్‌ 40,519 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకగా, చివరకు 448 పాయింట్ల లాభంతో 40,431 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11,850 పాయింట్ల మార్కుపైనే ముగిసింది.

అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, బ్యాంకు షేర్లు లాభాలబాట పట్టడం, కరోనాపై పోరాడుతున్న వారికి ముందుగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం, చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం తదితర అంశాలు మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయి. నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే, ఎస్‌బీఐ, గెయిల్‌ తదితర షేర్లు లాభపడగా, దివిస్‌ ల్యాబ్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, సిప్లా, బజాజ్‌ ఆటో తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.