
తాజా వార్తలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: వరుసగా మూడు రోజులపాటు లాభాలను ఆర్జించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.23గా ఉంది.
అమెరికా సహా ఐరోపా దేశాల్లో కరోనా వ్యాప్తి తిరిగి పెరుగుతుండటంతో మరోసారి లాక్డౌన్లు విధించవచ్చన్న వార్తలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. మరోవైపు అమెరికాలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు కూడా సూచీలు నేల చూపులు చూడటానికి పరోక్షంగా కారణమవుతున్నాయి. ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లన్నీ దాదాపు నష్టాల్లోనే కదలాడుతున్నాయి.
బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఓన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, టైటాన్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.