ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు విద్యార్థులు మృతి
close

తాజా వార్తలు

Published : 27/01/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు విద్యార్థులు మృతి

వెంకటగిరి రూరల్: నెల్లూరు జిల్లా వెంకటగిరి-ఏర్పేడు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటగిరి పట్టణానికి చెందిన 9వ తరగతి విద్యార్థులు కౌశిక్‌, విష్ణు, భార్గవ్ కలిసి ద్విచక్రవాహనంలో మిత్రులను కలిసేందుకు పల్లంపేటకు వెళుతుండగా ఎదురుగా మరో వాహనంలో వస్తున్న మెకానిక్‌ నాగరాజు వాహనాన్ని ఢీకొట్టారు. రెండు వాహనాలు వేగంగా పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం తీవ్రతకు ఆ నలుగురు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో నాగరాజు, కౌశిక్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా భార్గవ్‌, విష్ణు గాయపడ్డారు.

ఘటనాస్థలం నుంచి విష్ణు పరారవగా.. భార్గవ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి సీఐ కృష్ణ మోహన్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలం నుంచి పరారైన విద్యార్థి విష్ణు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి..

నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?

కలలు కరిగి.. హృదయం పగిలి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని