close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120083684 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => O4D2K_wWvDE [video_short_link] => O4D2K_wWvDE [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-07-08 18:24:12.974886 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 08/07/2020 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నయా గద్దర్‌ గళంలో పోగైన కరోనా.. చివరకు!

కొవిడ్‌పై అవగాహన కల్పించి కొవిడ్‌కే బలైన  సుద్దాల నిస్సార్

ఆయనో కవి గాయకుడు. తెలంగాణ ఉద్యమంలో తన కలం, గళంతో ప్రజలను చైతన్య వంతుల్ని చేసిన యోధుడు. ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై ఎలుగెత్తుతూ నయా గద్దర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేత, ప్రజానాట్య మండలి కార్యదర్శిగా సేవలందించారు. ఆయనే సుద్దాల నిస్సార్‌.

అనేకసార్లు సామాజిక అంశాలపై తన గళం వినిపించిన నిస్సార్‌ కరోనా వైరస్‌ మహమ్మారి గురించీ ఓ పాట రాశారు. స్వయంగా పాడి ప్రజలకు అవగాహన కల్పించారు. ‘అద్దె గట్టామాయె.. అప్పు పెరిగిపాయె.. వచ్చిన జీతమూ వడ్డీలకే పాయె’ అంటూ మధ్య తరగతి బాధలను అందులో తడిమారు. ‘చిట్టి గట్టామాయె.. ఉట్టి చేతులాయె.. పిల్లలా ఫీజుల ఫిగర్‌ పెరిగిపాయె’ అంటూ అందరినీ బాధపెడుతున్న ఈ ముదనష్టపు కాలం ఎప్పుడు పోతుందా అంటూ ఆవేదన చెందారు.

‘కంపెనీ బందాయె.. ఇల్లు గడవదాయె.. కడుపు నింపేదెట్లరన్నో.. రెక్కాడితే గానీ డొక్కాడనోళ్లము.. దిక్కులేకుంటతైమిరన్నా’ అంటూ ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టారు. ‘అడ్డమీదీ బతుకు అడ్రస్సు గల్లంతు.. వలస కూలీలంతా పలుసనైపోయిండ్రు.. పానీపూరీ, భజ్జీ, ఛాయ, జ్యూసు బండ్లు.. చక్రాలు తిరగకా చెమ్మగిల్లే కండ్లు’ అంటు నిరుపేదల కష్టాలను ఏకరవు పెట్టారు. ‘అర్ధరాతిరి పూట ఏ ఆపదొచ్చిన గానీ అవతలీకి యెళ్లలేమన్నో.. రైళ్లు, బస్సులు, బండ్లు బంద్‌వెడితే.. కాళ్లు నరికేసినట్లాయెరన్నా’ అంటూ ఆగిపోయిన జీవితచక్రం గురించి వివరించారు.

‘పెట్టుకున్నా పెండ్లి ఆగిపోయే.. దూరమున్న కొడుకు దరికి చేరడాయె..ఇంట్లెవరు చచ్చినా ఇరుగుపొరుగు రారు.. కడసూపు నోచని కన్నీటి గాథలు’ అంటూ ఇప్పుడు మనం చూస్తున్న ఉదంతాలను ముందే ఊహించి చెప్పారు. ‘కరోనా రోగంతో ముందు జాగ్రత్తలే కాపాడే మందూలోరన్నా..వ్యాక్సినొచ్చేదాకా మాస్క్‌ పెట్టుకోని మందితో దూరంముండన్నా.. నవ్వు మందితో దూరముండన్నా..’ అంటూ అందరికీ అవగాహన కల్పించిన నిస్సార్‌.. ఇప్పుడు అదే కరోనాకు బలయ్యారు. అభిమానులు, సాహితీవేత్తలు, ప్రజలు, తన ఆర్టీసీ సహచరులకు కన్నీరే మిగిల్చారు.

కొవిడ్‌-19కు మెరుగైన చికిత్స కోసం ఆయన అనేక ఆస్పత్రులు తిరిగారని సమాచారం. అయినప్పటికీ ఎక్కడా చేర్చుకోలేదు. చివరికి గాంధీలో చేరితే వెంటిలేటర్‌ సదుపాయం లేక తుదిశ్వాస విడిచారు. ఏ కరోనా వైరస్‌ నుంచి అందరూ తప్పించుకోవాలని అవగాహన కల్పించారో చివరికి ఆ రక్కని నోటికే చిక్కడం అందరినీ బాధిస్తోంది.

తెలంగాణ ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో జూమ్‌యాప్‌ ద్వారా బుధవారం సాయంత్రం నిస్సార్‌ సంతాప సభ నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, ప్రజా నాట్యమండలి కళాకారులు నిస్సార్‌కు నివాళులు అర్పించారు. వందేమాతరం భావోద్వేగానికి గురయ్యారు.

జాగ్రత్తలు తీసుకోండి:

కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అనవసరంగా బయటకు వెళ్లకూడదు. వెళ్తే మాస్క్‌, వీలైతే ఫేస్‌ షీల్డ్‌ పెట్టుకోవాలి. ఎవరికైనా ఆరడుగుల దూరం ఉండాలి. ఇప్పుడీ మహమ్మారి గాలిద్వారా వ్యాపిస్తుందనేందుకు ఆధారాలు బయటపడుతున్నాయి. అందుకే జనసమ్మర్ధం ఉంటే ప్రాంతాల్లోకి అస్సలు వెళ్లొద్దు. రోగ నిరోధక శక్తిపెంచుకోవడం కోసం పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.